: వినాయకుడికి వినతిపత్రం అందించారు


తమ సమస్యల సాధన కోసం ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిని ఇవ్వాలని కోరుతూ ఏకంగా వినాయకుడికే వినతి పత్రం ఇచ్చారు ఆశా కార్యకర్తలు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగింది. మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటిని ముట్టడించేందుకు ఆశా కార్యకర్తలు యత్నించారు. వీరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే, ఆ సమయంలో బాలరాజు ఇంట్లో లేరు. మరోవైపు, సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆశా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

  • Loading...

More Telugu News