: గుజరాత్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత


గుజరాత్ లో పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వదంతులను వ్యాప్తి చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గుజరాత్ లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకే ఈ సేవలను నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు ఏక్తాయాత్ర కారణంగా హార్దిక్ పటేల్ తో పాటు మరో 35 మంది మద్దతు దారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News