: చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు బాలికలు దుర్మరణం
చెరువులో బట్టలు ఉతకడానికని వెళ్లిన ముగ్గురు బాలికలు గల్లంతైన సంఘటన కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండలంలో చోటుచేసుకుంది. అల్లిపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు తారవ్వ(8), మీనా(5), గంగవ్వ(6) చెరువులో బట్టలు ఉతికేందుకని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందో ఏమో గానీ, వారు ముగ్గురు చెరువులో పడిపోవడంతో మృతి చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన వారు చెరువులో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటనతో అల్లిపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.