: ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయ అధికారులు శాసనసభ, మండలి సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఎన్ని రోజులు ఈ సమావేశాలు నిర్వహించనున్నారో తెలపలేదు.