: ఇప్పుడంతా కుల రాజకీయాలే... అనర్థాలు తప్పవు: మండలి బుద్ధ ప్రసాద్


వివాదాస్పద వ్యాఖ్యల జోలికి ఎన్నడూ వెళ్లని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయలు లేవని, వాటికి కాలం చెల్లిపోయిందని వాపోయారు. కేవలం కుల రాజకీయాలే నడుస్తున్నాయని చెప్పారు. రాజకీయాల్లో కులాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని అన్నారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు. మేధావులంతా దీని గురించి ఆలోచించాలని, కుల రాజకీయాలను ప్రశ్నించాలని, లేకపోతే రాబోయే కాలంలో అనర్థాలు తప్పవని చెప్పారు.

  • Loading...

More Telugu News