: హైదరాబాదులో వినాయక నిమజ్జనాలను ప్రారంభించిన హరీష్ రావు
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ లో పూజలు నిర్వహించి వినాయక నిమజ్జనాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం సాగునీటి శాఖ తరపున రూ.4.70 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ట్యాంక్ బండ్ పై 23, ఎన్టీఆర్ మార్గ్ లో 10 భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక జంట నగరాల్లో మరో 21 చెరువుల్లోనూ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 21 సంచార క్రేన్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈసారి నిమజ్జనం కోసం చెరువులన్నీ నిండు కుండల్లా ఉండటం శుభసూచకమన్నారు.