: చైనాలో దారుణం..అమ్మోనియా లీక్ :ఐదుగురి పరిస్థితి విషమం


ఒక కెమికల్ ప్లాంట్ నుంచి సింథటిక్ అమ్మోనియా వాయువు లీకవడంతో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా 41 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ఉన్న జోంగ్హాంగ్ కోల్ కెమికల్ లో జరిగింది. పైపు పగలడంతో 300 కిలో గ్రాముల అమ్మోనియా వాయువు లీకైనట్లు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే వార్తా సంస్థ ఒకటి తెలిపింది. కెమికల్ ప్లాంట్ లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా నిలిపివేశారు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రాంతాల్లో అమ్మోనియా పరిమాణం జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని చైనా అధికార వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News