: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుక కలకలం... మహిళ వేలు కొరికిన చిట్టెలుక
గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఎలుకల బెడద కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడి ఓ బాలుడు చనిపోయిన ఘటన మర్చిపోకముందే ఇవాళ మరో ఘటన జరిగింది. ఆసుపత్రిలో మళ్లీ ఎలుక కలకలం సృష్టించింది. జీజీహెచ్ లో వైద్యం కోసం వచ్చిన దుర్గకి చెందిన ఏసమ్మ అనే మహిళ చేతి వేలిని చిట్టెలుక కొరికింది. స్వల్పంగా గాయపడిన మహిళకు ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు.