: ట్యాంక్ బండపై కెమెరా మౌంటెడ్ వాహనాలు
ట్యాంక్ బండ్ పై కెమెరా మౌంటెడ్ వాహనాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు లేకుండా జరిగేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించామని నగర సీపీ చెప్పారు. ఇక్కడికి నిమజ్జనం నిమిత్తం వచ్చే వినాయక వాహనాల సంఖ్య విపరీతంగా వుంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆగిపోవడం, నిమజ్జనం జరగడంలో జాప్యం వంటి సమస్యలకు ఆస్కారం లేకుండా చేస్తామని నగర సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.