: భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? అయితే, 'గూగుల్ ఫార్చ్యూన్'ను అడగండి!


సమీప భవిష్యత్తులో మీ అదృష్టం ఎలా వుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకోసం గూగుల్ భవిష్యత్తు చెప్పే సరికొత్త యాప్ 'గూగుల్ ఫార్చ్యూన్'ను విడుదల చేసింది. ఇందులో ఇచ్చే విండోలో మీరు ఏ ప్రశ్నను టైప్ చేసినా దానికి సమాధానం మీకు లభిస్తుందట. అయితే, 'గూగుల్ ఫార్చ్యూన్'ను పరీక్షించాలని అడిగే కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రావడం లేదని నెటిజన్లు అప్పుడే కనిపెట్టేశారు. "ఈ ప్రపంచంలో మానవుల మధ్య యుద్ధాలు ఆగుతాయా?", "నేను నా కుటుంబంతో ఎప్పటికైనా కలుస్తానా?" అనే ప్రశ్నలు వేస్తే, సమాధానాలు సంతృప్తిగా రావడం లేదట. ప్రశ్నను వేసిన తరువాత 'ప్రెడిక్ట్ మై ఫ్యూచర్' బటన్ నొక్కితే, సమాధానమున్న పేజీ మీ కంటి ముందు ప్రత్యక్షమవుతుంది. యూరప్ లో శరణార్థుల కష్టాలపై ప్రపంచ ప్రజలకు అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టి 'గూగుల్ ఫార్చ్యూన్'ను విడుదల చేసినట్టు గూగుల్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News