: దసరాకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తాం: మంత్రి తలసాని


టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా పేదలకు డబుల్ రూం ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు దసరా పండుగనాడు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులోని ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ రోజు సనత్ నగర్ ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News