: ఏపీ ప్రజలకు విద్యుత్ 'షాక్'!


ఆంధ్రప్రదేశ్ వాసులకు మరోసారి 'విద్యుత్ షాక్' ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గృహావసరాలకు, పరిశ్రమలకు వినియోగిస్తున్న విద్యుత్ పై చార్జీలను పెంచాలని డిస్కంలు (విద్యుత్ పంపిణీ సంస్థలు) ఇప్పటికే నియంత్రణా మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు పంపాయి. మొత్తం రూ. 7,200 కోట్ల మేరకు ఆదాయం సమకూరేలా చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణను ఇప్పటికే ప్రారంభించింది. ఇది పూర్తయితే, రాష్ట్ర ప్రజలపై ఇంకొంత విద్యుత్ చార్జీల భారం తప్పకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News