: కేశవరెడ్డిని సీఐడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలులోని స్థానిక కోర్టు సీఐడీ కస్టడీకి ఇచ్చింది. వెంటనే ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదనపు ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సీఐడీ విచారించనుంది. సీఐడీ విచారణలో మరిన్ని విషయాలు బయటకువచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన డిపాజిట్ల అక్రమాల కేసులో కేశవరెడ్డిని కొన్నిరోజుల కిందట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది.