: కేంద్రం వద్ద ఉన్న నేతాజీ ఫైళ్లను బయటపెట్టే ఆలోచనలో ఉన్నాం: వెంకయ్యనాయుడు
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 64 ఫైళ్లను బయటపెట్టడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఫైళ్లలో సమాచారాన్ని పరిశీలించాలని అన్నారు. నేతాజీ జీవిత విశేషాలు, మరణంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న నేతాజీ పైళ్లను కూడా బయటపెట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అంతకంటే ముందుగా ఫైళ్లలో ఏముందో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.