: తమిళనాడు స్కూళ్లలో భాషా పండితుల కరవు!


తమిళనాడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది...వారి భాషాభిమానం. ఎక్కడైనా సరే, వారి భాషను పరిరక్షించుకోవడానికి తమిళ తంబీలు ముందుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కనుక, పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపడాల్సిన...షాక్ తినాల్సిన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే...తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భాషా పండితుల కొరత ఉందట. అదీ కూడా ఒకటో, అరో శాతం కాదు. ఏకంగా 40 శాతం వరకు ఉందట. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. పదవ తరగతికి సంబంధించి నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (ఎన్ఏెఎస్)లో భాగంగా రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్)కు చెందిన ఆరవ సంయుక్త సమీక్ష సంఘం(జేఆర్ఎస్) ఈ సర్వే నిర్వహించింది. దాని వివరాలు...తమిళనాడులోని మూడో వంతు పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు భాషకు సంబంధించిన సబ్జెక్టు కూడా లేదు. ఇది కేవలం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉంది. ఏదో ఒక సబ్జెక్టుకు సంబంధించిన పండితులు లేని పాఠశాలలు సుమారు 40 శాతం వరకు దేశంలో ఉన్నాయి. దీంతో వేరే సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడే భాషకు సంబంధించిన సబ్జెక్టులను బోధిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా డిజ్అడ్వాంటేజ్డ్ వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 29.45 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 23.32 శాతం, కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11.23 శాతం భాషా పండితుల సమస్య ఉంది.

  • Loading...

More Telugu News