: మక్కా బాధిత కుటుంబాలకు ఏపీ సీఎం ఆర్థికసాయం
హజ్ యాత్రకు వెళ్లి మక్కాలో జరిగిన క్రేన్ ప్రమాదంలో మరణించిన కృష్ణాజిల్లా వాసులు అబ్దుల్ ఖాదర్, ఫాతిమా కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు నష్టపరిహారం ఇచ్చారు. ఈ రోజు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సమయంలోనే వారికి కుటుంబానికి మూడు లక్షల చొప్పున రూ.6 లక్షలు అందజేశారు. మరోవైపు ఇటీవల లిబియాలో కిడ్నాపైన రామ్మూర్తి కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబును కలిశారు. కేంద్రంతో మాట్లాడి తమ వారిని సురక్షితంగా విడిపించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన సీఎం ఇందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.