: ఢిల్లీకి వెళ్లిన టీకాంగ్రెస్ నేతలు... వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై మంతనాలు!


తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హస్తిన బాట పట్టారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు గత రాత్రి ఢిల్లీకి వెళ్లారు. వీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమావేశమై త్వరలో జరగనున్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడే కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు సభ్యత్వ నమోదు వివరాలను ఏఐసీసీకి సమర్పిస్తారని, ఆపై రేపు రాంలీలా మైదానంలో జరిగే కిసాన్ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది. గడచిన ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలు, నిరసనలు, రాష్ట్ర రాజకీయ వాతావరణంపైనా వీరు అధినేత్రికి నివేదికను ఇవ్వనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News