: రేపు మరోసారి సింగపూర్ కు చంద్రబాబు టీమ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు మరోసారి సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. అమరావతి నిర్మాణం నిమిత్తం సింగపూర్ ఇచ్చిన ప్లాన్ లో మార్పు చేర్పులను గురించి చర్చించడంతో పాటు, ఈ పర్యటనకు సింగపూర్ ప్రధానిని ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన సాగనుంది. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే) కమిషనర్ శ్రీకాంత్ లు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో బాబు బృందం సుదీర్ఘ భేటీని జరపనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పాటు బాబు బృందం సింగపూర్ లో ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News