: అజింక్య రహానేకు అరుదైన గౌరవం!
భారత క్రికెట్ జట్టు సభ్యుడు అజింక్య రహానేకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఆయనకు జీవితకాల సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్ లో సభ్యత్వం కోసం వందలాది మంది క్రీడా ప్రముఖులు, వీఐపీలు ఎదురుచూస్తుంటారన్న సంగతి తెలిసిందే. రహానేతో పాటు ఆయన భార్యకూ సీసీఐ గౌరవ సభ్యత్వం లభించింది. ఇక దక్షిణ ముంబైలోని ఈ క్లబ్ అందించే సౌకర్యాలను రహానే జీవితాంతం వాడుకోవచ్చు. కాగా, త్వరలోనే హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, ఆమె భర్త షోయబ్ మాలిక్ కు సీసీఐ సభ్యత్వం దక్కనుంది. త్వరలోనే ఓ వేడుకను నిర్వహించి వీరికి సభ్యత్వం ఇవ్వాలని సీసీఐ ఆఫీస్ బేరర్లు భావిస్తున్నారని తెలుస్తోంది.