: వైఎస్సార్సీపీ నేతల బెయిల్ రద్దు
తూర్పుగోదావరి జిల్లా ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేతలు జక్కంపూడి రాజా, గణేష్ కు గతంలో అట్రాసిటీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు బెయిల్ పొందిన అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించారని పేర్కొంటూ న్యాయస్థానం వారి బెయిల్ ను రద్దు చేసింది. దీంతో ఈ కేసులో నిందితులైన జక్కంపూడి రాజా, గణేష్ తో పాటు మరో ఐదుగురికి బెయిల్ రద్దైంది. దీంతో వీరు రిమాండ్ కు వెళ్లనున్నారు.