: ప్రస్తుతం ఫుట్ బాల్ లో మెస్సీ, రొనాల్డో కంటే అతనే గ్రేట్!
ప్రపంచ ఫుట్ బాల్ లో ప్రస్తుత ఆటగాళ్లలో ఎవరు గొప్ప? అంటే ఎక్కువ మంది లియొనెల్ మెస్సీ పేరు చెబుతారు. మిగిలిన వారు క్రిష్టియానో రొనాల్డో అంటారు. కానీ వారిద్దరి కంటే కూడా నెయ్ మార్ గొప్పవాడని బ్రెజిల్ లెజెండ్ రాబర్టో కార్లోస్ చెబుతున్నాడు. ఐసీఎల్ (ఇండియన్ సూపర్ లీగ్) లో ఢిల్లీ డైనమాస్ ఆటగాడు, మేనేజర్ గా కొనసాగుతున్న కార్లోస్ మాట్లాడుతూ, ప్రస్తుత ఫుట్ బాల్ లో చెప్పుకోదగ్గ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా నెయ్ మారేనని తెలిపాడు. ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులు మెస్సీ, రొనాల్డో గొప్ప ఆటగాళ్లని భావిస్తారని అన్న కార్లోస్, వారు వారి జట్లకు చేసిందేమీ లేదని తేల్చేశాడు. నెయ్ మార్ బ్రెజిల్ జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చాడని కార్లోస్ అభిప్రాయపడ్డాడు.