: ప్రపంచంలో జీవించేందుకు చౌకైన నగరాలివిగో!


ఆధునిక ప్రపంచంలో జీవన వ్యయం పెరిగిపోతోంది. జేబులో వంద రూపాయలు లేకుండా బయటికెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ జీవనం మరింత వ్యయంతో కూడుకున్నదిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జీవించేందుకు చౌకైన నగరాల జాబితాను స్విస్ బ్యాంక్ యూబీఎస్ వెల్లడించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా పేరున్న 71 నగరాలను పరిశీలించింది. ఈ జాబితాలో ముంబై, ఢిల్లీ నగరాలున్నాయి. కాగా, తక్కువ జీతాలిచ్చేది కూడా ఇక్కడేనని సదరు సర్వే వెల్లడించింది. ప్రపంచంలో జీవించేందుకు అత్యంత ఖరీదైన తొలి రెండు నగరాల్లో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, జెనీవా నిలిచాయి. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో అమెరికాలోని న్యూయార్క్, నార్వే రాజధాని ఓస్లో, యూకే రాజధాని లండన్ నిలిచాయని సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News