: ఎస్సై మృతిపై స్పందించిన మంత్రి మహేందర్ రెడ్డి


రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతిపై మంత్రి మహేందర్ రెడ్డి స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సై రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఎస్సై బంధువుల కోరికమేరకు హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించామని అన్నారు. ఎస్సై వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. ఉస్మానియా వైద్యులు ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చారని ఆయన వెల్లడించారు. దీంతో, ఈ ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం లేదని స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. కాగా, ఎస్సై రమేష్ మృతి వెనుక మంత్రి మహేందర్ రెడ్డి హస్తముందని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News