: టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: ఆర్జేడీ ఎమ్మెల్యే


బీహార్ లో ఎన్నికల కష్టాలు మొదలయ్యాయి. తాజా ఎన్నికలు బీహార్ లోని కీలక పార్టీలన్నింటికీ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో పార్టీల మధ్య పొత్తులు అనివార్యమయ్యాయి. ఈ పొత్తుల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల్లో పార్టీల అండ ఎంత ముఖ్యమో తెలిసిన అభ్యర్థులు సీట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆర్జేడీ ఎమ్మెల్యే దినేష్ కుమార్ సింగ్ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే దినేష్ కుమార్ కు ఈసారి టికెట్ లభించే అవకాశం లేదంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలు వెలువడడం వెనుక కారణాలు చెప్పాలంటూ ఆయన ఆందోళనకు దిగారు. ఈ రూమర్లపై పార్టీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ తనకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటిలోగా స్పందించి లాలూ సమాధానం చెప్పని పక్షంలో పార్టీ కార్యాలయం ఎదుటే ఆమరణ నిరాహార దీక్షకు దిగి, ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News