: అఫ్రిది దగ్గర గోడు వెళ్లబోసుకున్న సల్మాన్ భట్
ఓ తప్పు పెను శిక్ష విధించిందని పాక్ టీ ట్వింటీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది దగ్గర టెస్టు జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఫిక్సింగ్ కు పాల్పడకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో కనీసం నీ సలహా అయినా తీసుకుని ఉండాల్సింది అని అఫ్రిదితో అన్నాడు. దీంతో, 'అయిందేదో అయిపోయింది. ఇకనైనా క్రికెట్ పై దృష్టి పెట్టు' అని అఫ్రిది సలహా ఇచ్చాడు. 2010లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి, ఐదేళ్ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఈ మధ్యే పీసీబీ దేశవాళీ క్రికెట్ ఆడుకోవచ్చని అతనికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో సల్మాన్ భట్ అఫ్రిదిని కలిశాడు.