: నా పేరుతో నకిలీ అకౌంట్లున్నాయి .. అభిమానులారా...జర జాగ్రత్త!: మనీషా కొయిరాలా
హీరోయిన్ మనీషా కొయిరాలా తన అభిమానులను జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించింది. తన పేరిట చాలా నకిలీ అకౌంట్లు ఫేస్ బుక్ లో ఉన్నాయట. అందుకే, ఈ హెచ్చరిక చేసింది. తానే పోస్టు చేశాననుకుని పొరపాటు బడతారేమోనని, ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరిస్తున్నానని మనీషా తన ఒరిజినల్ అకౌంటులో పేర్కొంది. 'తొందరపడి స్పందించకండి' అని చెప్పింది. కాగా, నేపాల్ దేశం స్వస్థలమైన మనీషా కొయిరాలా, అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కూడా స్పందించారు. శాంతియుత మార్గాల ద్వారా తాము అనుకున్నది సాధించుకోవాలని సూచించింది.