: పర్యాటకం ద్వారా 8 నెలల్లో 82,225 కోట్ల ఆదాయం
భారత్ ను సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. గత మూడేళ్లలో పెరిగిన పర్యాటకుల సంఖ్యను వివరిస్తూ ఓ పట్టిక విడుదల చేసింది. దీని ప్రకారం 2014 జనవరి నుంచి ఆగస్టు వరకు వచ్చిన విదేశీ పర్యాటకుల వల్ల 79, 803 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం వచ్చిందని తెలిపారు. 2015 జనవరి నుంచి ఆగస్టు వరకు 82,225 కోట్ల రూపాయల విదేశీ మారకం సమకూరినట్టు పర్యాటక శాఖ వివరించింది. భవిష్యత్ లో పర్యాటకులు మరింత పెరుగుతారని పర్యాటక శాఖ తెలిపింది. ఆగస్టులో అమెరికా, యూకే, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున భారత్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.