: నాగపూర్ లో విష్ణు'మోదీ'కి పూజలు!
ముంబయిలో గణేశ్ ఉత్సవాలు మార్మోగిపోయేలా చేస్తుంటారు. విభిన్న ఆకృతులలో ఉన్న గణనాథుని విగ్రహాలు అక్కడ దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో భక్తి ఇంకొంచెం ఎక్కువైంది. తమ అభిమాననేత, దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఫ్లెక్సీ ఒకటి నాగపూర్ లో దర్శనమిచ్చింది. భారీ గణపతి విగ్రహంతో పాటు మోదీ తలకాయ, విష్ణుమూర్తి శరీరంతో ఉన్న ఈ ఫెక్సీకి భక్తులు పూజలు చేస్తున్నారు. హారతులు పడు తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతగా నీరాజనాలు అందుకుంటున్న మోదీకి నేడు దేవుడి రూపాన్ని ఆపాదించి ఆయనకు హారతులు పడుతున్నారు. దీనిపై సర్వత్ర విమర్శలు గుప్పుముంటున్నాయి.