: షీనా బోరా హత్య కేసు సీబీఐకి బదిలీ


సంచలనాత్మక షీనా బోరా హత్య కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ కేసులో కేవలం హత్యే కాకుండా ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నందున విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖలోని ముఖ్య అధికారి కేపీ భక్షి తెలిపారు. ఇంతవరకు ఈ కేసును ముంబై పోలీసులు విచారించారు. ఈ కేసును విచారిస్తూ వచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను ఇటీవల అనూహ్యంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అహ్మద్ జావేద్ నియమితులయ్యారు. అయితే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పీటర్ ముఖర్జియా, జావెద్ లు సన్నిహితులని ఆరోపణలు వచ్చాయని, అందుకే కేసును రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినట్టు భక్షి వివరించారు. ప్రస్తుతం ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు రిమాండ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News