: మనుషుల్లాగే పక్షులు కూడా ప్రేమించుకుంటాయట!
మనుషుల్లాగే పక్షులు కూడా ప్రేమించుకుంటాయని పరిశోధకులు తెలిపారు. పక్షులు ప్రేమించుకుంటాయా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు 160 పక్షులను పరిశోధించారు. ఇందులో 20 ఆడపక్షులున్న గదిలోకి 20 మగ పక్షులను పంపి, డేటింగ్ సెషన్ ఏర్పాటు చేశారు. పంపించిన కాసేపటికే పక్షులన్నీ జంటలైపోయాయి. ఆ తరువాత అక్కడ ఉండకుండా స్వేచ్ఛగా ఎగిరిపోయేందుకు ప్రయత్నించాయట. ఆ తరువాత ఆ జంటలను విడదీసి, మరో గదిలో ఉన్న ఆడపక్షుల దగ్గరికి పంపారు. దీంతో ఆ పక్షులన్నీ బాధపడిపోయాయట. విరహవేదన అనుభవించినట్టుగా ఉత్సాహంగా లేకుండా విషాదంలో మునిగిపోయాయి. ఆ సమయంలో అవి పెట్టిన గుడ్లు కూడా ఆరోగ్యంగా లేవని పరిశోధకులు చెప్పారు. ఆ గుడ్లలో ఎక్కువ శాతం గుడ్లు పిల్లలయ్యాక మృతి చెందినట్టు వారు తెలిపారు. వీటిపై ఎన్నో పరిశోధనలు చేసిన పరిశోధకులు చివరకు పక్షుల్లో కూడా ప్రేమ పుడుతుందని నిర్ధారించారు.