: నటనకు ప్రాధాన్యమున్న ఏ పాత్రలోనైనా నటిస్తా: లారా దత్తా
టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతిని వివాహం చేసుకుని, ఓ పాపకు జన్మనిచ్చినప్పటి నుంచి నటి లారా దత్తా నటనకు దూరంగా ఉంటోంది. త్వరలో అక్షయ్ కుమార్ నటించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంతో తన సెంకడ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతోంది. ఇందులో ఓ ప్రధాన పాత్రలో చేస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో లారా మాట్లాడుతూ, నటనకు ప్రాధాన్యమున్న ఏ పాత్రలోనైనా నటించేందుకు తాను సిద్ధమేనని చెబుతోంది. గ్లామర్ పాత్రల్లో నటించాలని కానీ, ప్రధాన పాత్రల్లోనే నటించాలని కానీ, తనపై ఎలాంటి ఒత్తిడి లేదంటోంది. అంతేకాదు, అందంగా కనిపించాలన్న తాపత్రయం కూడా తనకు లేదని లారా అంటోంది.