: పాక్ ఎయిర్ బేస్ పై తాలిబన్ల దాడి...30 మంది మృతి
పాకిస్థాన్ ఎయిర్ బేస్ పై తాలిబన్లు విరుచుకుపడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ దాడిలో సుమారు 17 మంది పౌరులు హతమైనట్లు పాకిస్థాన్ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిమ్ బాజ్వా వెల్లడించారు. పెషావర్ లోని బదాబెర్ ఎయిర్ బేస్ క్యాంపు వద్ద ఉన్న మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పాక్ బలగాలు ప్రతిఘటించి 13 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాయన్నారు. ఎయిర్ ఫోర్స్ క్యాంపు లోపల ఉన్న మసీదులో ప్రార్థనలు చేస్తున్న సుమారు 17 మంది పౌరులను మిలిటెంట్లు కాల్చివేశారని ఆ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, మృతి చెందిన వారు పౌరులా? లేక మిలిటరీ సిబ్బందా? అన్నది స్పష్టంగా తెలియడం లేదన్నారు.