: ఆ విధంగా రష్యా లెఫ్టినెంట్ కల్నల్ అమెరికాపై అణుదాడిని నివారించాడు!


రష్యా లెఫ్టినెంట్ కల్నల్ అమెరికాను కాపాడడమేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి. అమెరికా, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న రోజులవి. 1983 సెప్టెంబర్ నెలలో అమెరికా నుంచి దక్షిణకొరియాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానాన్ని గూఢచారి విమానంగా భావించిన రష్యా గగనతలంతోనే పేల్చేసింది. దీంతో అమెరికా ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని భావించిన రష్యా అణుబాంబులను సిద్ధంగా ఉంచింది. రష్యాపై దాడి చేసేందుకు అమెరికా ఖండాంతర క్షిపణి 'బాలిస్టిక్'ని సిద్ధంగా ఉంచింది. అమెరికా బాలిస్టిక్ క్షిపణితో రష్యాపై దాడికి దిగిన మరుక్షణం అమెరికాపై అణుబాంబులతో విరుచుకుపడాలని రష్యా భావించింది. ఈ అణువిధ్వంసానికి ఉన్నతాధికారులతో ఓ టీం కూడా ఏర్పాటు చేసింది. ఈ జట్టులో లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లవ్ పెట్రోవ్ (43) కీలకమైన విభాగానికి నియమితుడయ్యారు. శత్రువు క్షిపణి దాడికి పాల్పడతాడా? లేదా? అనేది నిర్ధారించి, ఉన్నతాధికారులకు ఆయన సిగ్నల్ ఇవ్వాలి. ఆయన సిగ్నల్ ఇవ్వగానే అమెరికాపై అణుబాంబులతో విరుచుకుపడాలని రష్యా నిర్ణయించింది. ఇంతలో సెప్టెంబర్ 23న అమెరికా దళాలు క్షిపణి ప్రయోగిస్తున్నట్టు సైరన్ మోగించాయి. కొన్నిసార్లు ఆయుధాలు ప్రయోగించకుండా శత్రువును ఉచ్చులోకి లాగేందుకు, ముందుగా దాడికి పాల్పడేలా ప్రోత్సహించేందుకు కూడా సైరన్ మోగించేవారు. సైరన్ విన్న పెట్రోవ్ అది నిజమైన క్షిపణి ప్రయోగమో, కాదో తెలియక ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదు. తరువాత అది తమను రెచ్చగొట్టేందుకు వాడిన ఫేక్ సైరన్ గా నిర్ధారణ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అప్పుడు పెట్రోవ్ పొరపడి సిగ్నల్ ఇచ్చి ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేది. ఈ ఘటనపై తాజాగా హాలీవుడ్ లో రూపొందిన 'ద మ్యాన్ హు సేవ్డ్ ద వరల్డ్' సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీనిపై 76 ఏళ్ల పెట్రోవ్ మాట్లాడుతూ, ఇప్పటికీ ఆ సైరన్ తన గుండెల్లో ప్రతి ధ్వనిస్తుందని చెబుతారు.

  • Loading...

More Telugu News