: భారత డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన పాకిస్థాన్
చేసేవన్నీ చేస్తూ, పక్క దేశమే అన్నీ చేస్తోందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది పాకిస్థాన్. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సైన్యంపై, సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్ నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉంటుంది. ఈ కాల్పులను భారత జవాన్లు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రపంచ దేశాల ముందు తానేదో గొప్ప దేశమనే బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సరిహద్దుల్లో భారత సైన్యం కాల్పులు జరిపిందని, ఆ కాల్పుల్లో పాక్ పౌరులు గాయపడ్డారని, భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. అంతేకాదు, ఈ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ లోని భారత డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు కూడా జారీ చేసింది.