: నాగం వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివి: టీఆర్ఎస్
బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని టీఎస్ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అధికారపక్షంపై విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదని... గత ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేపట్టిన చైనా పర్యటనపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయని అన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.