: ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది: మమతా బెనర్జీ


స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 64 దస్త్రాలను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కోల్ కతా మ్యూజియంలో ఉంచిన దస్త్రాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. నేతాజీ దస్త్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేసిందని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆమె మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న దస్త్రాలను బహిర్గతం చేసి నేతాజీకి సంబంధించిన విషయాలు దేశ ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఆయన మరణించడం దురదృష్టకరమన్న దీదీ, ఆయన మృతి 70 ఏళ్లుగా రహస్యంగా మిగిలిపోయిందని అన్నారు. వాస్తవాలు ఎంతోకాలం దాగి ఉండలేవని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయని మమత వ్యాఖ్యానించారు. నేతాజీ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News