: ఇదో శాడిజం...రోజుకి 90 మిస్డ్ కాల్స్!


బాగా తెలిసిన స్నేహితుడు మిస్డ్ కాల్ ఇస్తేనే చిరాకు పుడుతుంది. అలాంటిది రోజుకి 90 మిస్డ్ కాల్స్ ఇచ్చి సహనానికి పరీక్షపెట్టాడో ప్రబుద్ధుడు. ఉత్తరప్రదేశ్ లోని పూర్తిగా మహిళలు నడిపే పత్రిక 'ఖబర్ లహరియా'లో పని చేసే ఐదుగురు రిపోర్టర్లను ఒక దుండగుడు మిస్డ్ కాల్స్ తో వేధించడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, రోజుకి ఏకంగా 90 మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు. ఈ మిస్డ్ కాల్స్ కి అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా ఉండేది కాదు. అతనికెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మిస్డ్ కాల్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. కేవలం మిస్డ్ కాల్స్ తో ఊరుకోలేదు, బెదిరింపులకు, దూషణలకు దిగేవాడు. దీంతో దుండగుడి కాల్స్ పై తొలుత పోలీసులకు ఫిర్యాదివ్వగా, మిస్డ్ కాల్సే కదా లైట్ తీసుకొమ్మన్నారు. కానీ రోజుకి 90 మిస్డ్ కాల్స్ అనగానే కేసు తీవ్రత అర్థం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News