: గుంటూరు జిల్లాలో అపశృతి... వినాయక నిమజ్జనంలో వ్యక్తి మృతి


గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. నేమరికల్లు మండలంలోని గుండ్లపల్లిలో నిన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రోజు నిమజ్జనం చేయడానికి గ్రామస్తులంతా వెళ్లారు. నిమజ్జనం అనంతరం సాంబిరెడ్డి (50) అనే వ్యక్తి చెరువులో ఈత కొట్టి, ఒడ్డున కూర్చున్నాడు. అనంతరం అక్కడికక్కడే కుప్పకూలిపోయి, మృతి చెందాడు. గుండెపోటుతోనే అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఉత్సాహంగా జరిగిన కార్యక్రమంలో, తమ ఆత్మీయుడిని కోల్పోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News