: ఎంతసేపూ డబ్బు అంటారు...పని గురించి పట్టించుకోరే?: కస్సుమన్న కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ ఉద్యోగులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీని డెంగ్యూ వ్యాధి వణికిస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, ఆసుపత్రులను చుట్టేసిన కేజ్రీవాల్, మున్సిపల్ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇస్తున్నా పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సేపూ డబ్బు డబ్బు అంటారు తప్ప పని గురించి పట్టించుకోరే! అంటూ కస్సుమన్నారు. 'ఇచ్చిన డబ్బులన్నీ తినేస్తున్నారు, అలాగే పని కూడా చేయడం నేర్చుకోండి' అని ఆయన చురకంటించారు. డెంగ్యూ వ్యాధిపై ఢిల్లీ వాసుల్లో ఆందోళన నెలకొనడంతో ధైర్యం చెప్పడానికి ఆయన పర్యటించారు.