: తాజ్ మహల్ మెట్ల పైనుంచి జారిపడి జపాన్ పర్యాటకుడి మృతి


పవిత్ర ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్ మెట్లపై జారిపడి జపాన్ కు చెందిన పర్యాటకుడు ఉయెద (66) మరణించారు. తన ఇద్దరు మిత్రులతో కలసి ఇండియాకు వచ్చిన ఆయన, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను సందర్శించిన అనంతరం తాజ్ వద్దకు వచ్చారు. తాజ్ లోకి ప్రవేశించిన ఈ మిత్రబృందంలో ఉయెద, అతని స్నేహితుడు మెట్లపై నుంచి జారి పడ్డారు. ఉయెద తలకు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితుడికి కాలు విరిగింది. వీరిద్దరినీ తాజ్ నిర్వహణ బృందం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, తీవ్ర రక్తస్రావం కావడంతో ఉయెద అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని జపాన్ దౌత్య కార్యాలయానికి తెలిపామని, మృతదేహాన్ని జపాన్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News