: శునకం పశ్చాత్తాపం... యజమానిని క్షమాపణలు కోరుతున్న వీడియోను వీక్షించండి!
గొడవ చేస్తేనో, చెప్పిన మాట వినకపోతేనో లేదా ఇతరత్రా కారణాల వల్లో పిల్లలతో కాసేపు మాట్లాడకుండా ఆటపట్టించే తల్లిదండ్రులను చూస్తుంటాం. అయితే, ఇక్కడ తన పెంపుడు జంతువు గొడవ చేస్తుంటే కోపం పట్టలేక దాని యజమాని, కొంత సేపు తన పెట్ ను పలుకరించకుండా ఉండిపోయాడు. దీంతో, పశ్చాత్తాపపడ్డ ఆ శునకం, తన యజమానిని ఏ విధంగా క్షమాపణలు కోరిందో చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను 25 లక్షల మంది కంటే ఎక్కువ మందే వీక్షించారు.