: చంద్రబాబుతో మాట్లాడిన తరువాతే, పొగాకు రైతులపై ప్రకటన: నిర్మాలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు మేలు కలిగించే నిర్ణయాన్ని ప్రకటించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా వల్లేటివారిపాలెం మండలం కొండ సముద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ నీలం వెంకట్రావ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేటి సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు తెలిపారు. ఆ తరువాత పొగాకు రైతుల విషయమై ఓ ప్రకటన వెలువరిస్తామని అన్నారు. పొగాకు రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచించారు. కాగా, ఎలాంటి ప్రకటనా చేయకుండానే కేంద్ర మంత్రి పర్యటన ముగియడంపై కందుకూరు వేలం-2 కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు.