: జగన్ పిచ్చోడిలా తిరిగే రోజు దగ్గరలోనే ఉంది: ప్రత్తిపాటి
ఏపీ రాష్ట్ర అభివృద్ధిని వైకాపా అధినేత జగన్ అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సాక్షాత్తు ప్రపంచ బ్యాంకే దేశంలో ఏపీకి రెండో ర్యాంకు ఇస్తే, జగన్ మాత్రం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయే అవకాశం ఉందని చెప్పారు. జగన్ పిచ్చోడిలా తిరిగే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.