: కలెక్టర్ల సదస్సులో అవినీతిపై చంద్రబాబు ఆందోళన


విజయవాడలో ఇవాళ జరిగిన కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సులో అవినీతిపై సీఎం చంద్రబాబు ప్రధానంగా మాట్లాడారు. కొన్ని శాఖల్లో అవినీతి శాతం డబుల్ డిజిట్ కు చేరిందన్నారు. రెవెన్యూ, పురపాలక శాఖలపై అవినీతి ముద్ర ఉందని, ఈ రెండు శాఖల్లో అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇసుక విధానంలో ఇప్పటికీ లొసుగులున్నాయన్న సీఎం, కొన్ని ప్రాంతాల్లో ఇసుక మాఫీయా ఆధిపత్యం చెలాయిస్తోందని పేర్కొన్నారు. దానిపై సమీక్షించాల్సి ఉందన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత 'మీ ఇంటికి మీ భూమి' అమలు చేస్తామని చెప్పారు. భూమికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తే సంబంధింత వీఆర్ఓ, ఎమ్మార్వోలనే బాధ్యులను చేస్తామని బాబు హెచ్చరించారు. అవినీతి ఎంత ప్రమాదకరమో అసమర్థత కూడా అంతే ప్రమాదకరమని పేర్కొన్నారు. భూసమీకరణ అంశంలో కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్ల పనితీరు బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి మూడు నెలల అభివృద్ధిని సమీక్షిస్తున్న విధానం దేశంలోనే ప్రథమం అని, ఈ విధానాన్ని అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News