: రైల్వే శాఖలో ఆందోళన...తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య!


రైల్వేశాఖ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే, రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య క్రమేపి తగ్గిపోతోందట. రైలు చార్జీలలో ఎటువంటి పెరుగుదల లేనప్పటికీ, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుండటంపై ఆ శాఖ అసంతృప్తిగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో 15 కోట్ల మంది ప్రయాణికులను రైల్వే శాఖ పోగొట్టుకుందని మంత్రి సురేష్ ప్రభు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మూడు రోజుల క్రితం జరిగిన జనరల్ మేనేజర్ల సమావేశంలో చర్చించారట. దీనిపై రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఆశ్చర్యం వ్యక్తం చేశారని సమాచారం. ‘రైళ్లన్నీ ఫుల్ గా వెళుతున్నాయి. రిజర్వేషన్ చేయించుకుందామన్నా దొరకని పరిస్థితులు. లెక్కలు చూస్తేనేమో, రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు చెబుతున్నాయి. ఇదెట్లా సాధ్యం? అంకెల గారడీ ఏదో జరిగింది’ అని మనోజ్ అన్నారు.

  • Loading...

More Telugu News