: రైతుల కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 90 లక్షల విరాళం


సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన సినీ తారల్లో పెరిగిపోతోంది. టాలీవుడ్ లో మహేష్ బాబు, మంచు విష్ణు, శ్రుతిహాసన్, ప్రకాశ్ రాజ్ తదితరులు గ్రామాలను దత్తత తీసుకుని, ఆయా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్లు కూడా చేరుతున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ రైతులకు ఆర్థిక సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నానా బాటలో అక్షయ్ కుమార్ కూడా అడుగేశాడు. 180 రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చాడు. వీరికోసం ఇప్పటికే రూ. 90 లక్షలను డొనేట్ చేశాడు. అయితే, తాను చేస్తున్న ఈ సాయం గురించి స్పందించడానికి మాత్రం అక్షయ్ సుముఖత చూపించడం లేదు. కానీ, మరింత మంది ఇదే విధంగా స్పందించేలా మీడియా తన వార్తల ద్వారా ప్రయత్నించాలని మాత్రం విన్నవించాడు.

  • Loading...

More Telugu News