: ఒక ఐడియా! చట్టబద్ధంగా, శ్రమ లేకుండా డబ్బు సంపాదిస్తున్న అమెరికన్... ఎలాగంటే!


ఓ చిన్న ఐడియా, ఆ అమెరికన్ ఏ మాత్రం కష్టపడకుండా, చట్టబద్ధంగా డబ్బు సంపాదించేలా చేస్తోంది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవారు పెరిగిపోయిన తరుణంలో, ఓ పెద్దాయన చేస్తున్న పని, అతనికి నెలకు 100 డాలర్ల వరకూ సంపాదించి పెడుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, యూఎస్ కు చెందిన గ్యారీ (60) అనే పదవీ విరమణ చేసిన ఉద్యోగి, తాను, వెచ్చించే ప్రతి డాలర్ పైనా ఓ మాట, దానికింద తన చిరునామా రాస్తాడు. "నేను చాలా పేదవాడిని. ఈ డాలర్ ను నాకు తిరిగి పంపించండి... ప్లీజ్" అని రాసి చిరునామా ఇస్తున్నాడు. ఈ ఐడియా కాస్తా పనిచేసింది. ఆ నోటును చూసిన కొందరు దాన్ని తిరిగి గ్యారీకి పంపుతున్నారు. ఇలా రోజుకు రెండు డాలర్ల వరకూ తిరిగి వస్తోందని, కొంతమంది కాస్త ఎక్కువ జోడించి పంపుతుండటంతో, నెలకు 100 డాలర్ల వరకూ వస్తోందని గ్యారీ ఆనందంగా చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News