: ప్రియాంకా చోప్రా మెచ్చిన బాలీవుడ్ నటి


ప్రస్తుతం అమెరికాలో ఉన్న బాలీవుడ్ హీరోయిన్, సింగర్ అయిన ప్రియాంక చోప్రా తనకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? అంటూ ప్రశ్నిస్తోంది. ఈరోజుతో 65వ పడిలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ తనకు స్ఫూర్తి అని చెబుతోంది. షబానాను అట్లానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంటూ ట్వీట్ చేసింది. షబానా ఆజ్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తన మనసులోని మాటను బయట పెట్టింది ప్రియాంకా చోప్రా. కాగా, హీరోయిన్, ప్రొడ్యూసర్ దియా మీర్జా కూడా షబానాకు బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేసింది. షబానా ఆజ్మీ ఒక అద్భుతమైన వ్యక్తని, ఆమె చూపించే మానవత్వం తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని దియా ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News