: రూ. 110 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత


భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏకంగా రూ. 110 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి కొందరు వ్యక్తులు ఈ మాదకద్రవ్యాన్ని సరిహద్దు దాటిస్తుండగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. భారత కస్టమ్స్ అధికారులు, బీఎస్ఎఫ్ బలగాలు ఉమ్మడిగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్ల ఆట కట్టించారు. పోలీసుల సమాచారం ప్రకారం, గత రాత్రి అంతర్జాతీయ సరిహద్దు వద్ద కొన్ని అనుమానిత కదలికలు కనిపించాయి. దీంతో, తెల్లవారుజామునే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, 22 కేజీల హెరాయిన్ పట్టుబడింది. దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అరెస్టులు జరగనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News