: మెదక్ పోలీసుల కాఠిన్యం... చోరీ పేరిట పదేళ్ల బాలుడికి సంకెళ్లేసిన వైనం


కరుడుగట్టిన వైఖరికి కేరాఫ్ అడ్రెస్ గా మెదక్ పోలీసులు అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. గతంలో ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిచిన ఓ మైనర్ బాలుడికి రాత్రంతా సంకెళ్లేసిన ఆ జిల్లా పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొన్నటికి మొన్న ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిచి ఓ వ్యక్తిని దారుణం కొట్టి చంపారు. తాజాగా దొంగతనం చేశాడన్న ఆరోపణలతో పదేళ్ల బాలుడికి ఆ జిల్లా పోలీసులు సంకెళ్లేశారు. కోర్టు విచారణకు తీసుకొచ్చే క్రమంలో బాలుడిని సంకెళ్లతోనే బస్సెక్కించారు. బస్సులో సంకెళ్లతో కూర్చున్న బాలుడిని గమనించిన మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను షూట్ చేయడంతో పోలీసులు బాలుడిని తీసుకుని అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News